- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSPSC : గ్రూప్ -2, గ్రూప్ -4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరిగేనా?
దిశ, వెబ్‌డెస్క్: TSPSC ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో సిట్ అధికారులు రోజుకో కొత్త విషయాన్ని బయటపెడుతున్నారు. అయితే తాజగా గ్రూప్ - 2, గ్రూప్ - 4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేక వాయిదా పడతాయా? అనే టెన్షన్ అభ్యర్థుల్లో మొదలైంది. ప్రశ్నా పత్రాల లీకేజీ కారణంగా ఇప్పటికే పలు పరీక్షలను బోర్డు రీ షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. కాగా గ్రూప్-2, గ్రూప్-4 ను కూడా రీ షెడ్యూల్ చేస్తుందా లేక అనుకున్న సమయానికి పరీక్షలు నిర్వహిస్తుందా అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరిగితే ప్రస్తుతం సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రణాళికను కొనసాగించడం లేదా ఒక వేళ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగితే ప్రణాళికల్లో మార్పులు చేసుకునేలా సిద్ధమవుతున్నారు. టీఎస్పీఎస్సీ ఇప్పటికే గ్రూప్-4 పరీక్షను జూలై 1, గ్రూప్-2 పరీక్షలను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇటీవల గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన కమిషన్, జూన్ 11న మళ్లీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్-4 ఈ మూడింటిని వరుసగా నిర్వహిస్తే అభ్యర్థులకు ఇబ్బందులు వస్తాయా? సిద్ధమయ్యేందుకు సమయం సరిపోతుందా? లాంటి విషయాలను పరిగణలోకి తీసుకుని టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్‌పై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.