- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Peddi Glimpses: ఆల్ టైమ్ రికార్డ్.. 24 గంటల్లో అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతోన్న ‘పెద్ది’ గ్లింప్స్ (ట్వీట్)

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే రామ్ చరణ్ 16వ మూవీగా రాబోతున్న ఈ సినిమాను వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్(Shivaraj Kumar), దివ్యేందు శర్మ వంటి నటులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్స్‌లోకి రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసిన సంగతి తెలిసిందే. ఇక శ్రీరామ నవమి పండుగ సందర్భంగా వచ్చిన ఫస్ట్ షాట్ గ్లింప్స్ మాత్రం ఊహించని విధంగా ఉండటంతో ప్రేక్షకులను ఫిదా చేయడంతో పాటు పలువురు సినీ ప్రముఖులకు కూడా నచ్చాయి.
ఇక ఇందులోని రామ్ చరణ్ డైలాగ్స్ క్రికెట్ ఆడటం అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇక ఈ గ్లింప్స్‌పై కొంతమంది హీరో,హీరోయిన్లు కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేశారు. గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘పెద్ది’ గ్లింప్స్ దర్శనమిస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ గ్లింప్స్‌లో ఆయన క్రికెట్ ఆడిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘పెద్ది’ గ్లింప్స్ కేవలం 24 గంటల్లోనే ఆల్ టైమ్ రికార్డును సాధించినట్లు మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. బ్లాక్ బస్టర్ షార్ట్ తెలుగు భాషలో విడుదలైన ఈ గ్లింప్స్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ కావడంతో పాటు 24 గంటల్లో 36.5 మిలియన్ల రియల్ టైమ్ వ్యూస్ సాధించింది. అది కూడా కేవలం ఒక చానల్ పరంగానే ఈ వ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ మేకర్స్ రామ్ చరణ్ పోస్టర్‌ను షేర్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ పోస్టర్‌ను నెట్టింట షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.