TSPSC: బీజేవైఎం నేతలపై కేసు నమోదు.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

by Mahesh |
TSPSC: బీజేవైఎం నేతలపై కేసు నమోదు.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో : పేపర్ లీకేజీ ఘటనపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కార్యాలయాన్ని ముట్టడికి యత్నించి, కార్యాలయం బోర్డు ధ్వంసం చేసిన బీజేవైఎం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో భాగంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, పలువురు కార్యకర్తల పైనా కేసులు ఫైల్ అయ్యాయి. టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేవైఎం నేతలు, కార్యకర్తలతో కలిసి హైదారాబాద్‌లోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు.

ఈ ఘటనలో ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముట్టడికి యత్నించిన బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్, శివశంకర్‌, పవన్‌రెడ్డి, జమాల్‌పూర్‌ ఆయుష్‌, ఏ రాజునేత, మన్మధరావు, పూజారి రాము యాదవ్‌లపై ఐపీసీ సెక్షన్ 3&4,143, 427, 448, 353 తో పాటు 149 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అరెస్టు అనంతరం బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు వైద్య పరీక్షలు నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు. ఈ కేసులో 9 మంది బీజేవైఎం నేతలను అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం వీరిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించగా, చంచల్ గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు.

టీఎస్‌పీఎస్సీ వద్ద భద్రత పెంపు..

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు, పలు విపక్ష పార్టీల కార్యకర్తలు కార్యాలయం ఎదుట నిన్న ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. కార్యాలయం ముందు బారికేడ్లు వేసి, ఫైర్ ఇంజన్‌ను కూడా సిద్ధంగా ఉంచారు.

Advertisement

Next Story

Most Viewed