- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS: ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ హైకోర్టుతో పాటు పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. మూడు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లలిత కన్నెగంటిని, జస్టిస్ డాక్టర్ డి.నాగరాజు, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి లను వరుసగా కర్ణాటక, మద్రాస్, పాట్నా హైకోర్టులకు బదిలీ చేస్తూ సిఫార్సు చేసింది. జస్టిస్ బట్టు దేవానంద్, డి.రమేష్ లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మద్రాస్, అలహాబాద్ హైకోర్టుకు, మద్రాస్ హైకోర్టుకు చెందిన జస్టిస్ వి.ఎం. వేలుమణి, జస్టిస్ టి.రాజాలను కలకత్తా, రాజాస్థాన్ హైకోర్టులకు బదిలీ చేస్తూ కొలీజియం సిపార్సు చేసింది.
తెలంగాణకు చెందిన జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సుపై గతంలోనే తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ సమ్మెకు దిగింది. జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తూ అడ్వకేట్స్ బృందం సీజేఐని కలిసి వినతి పత్రం కూడా అందజేసింది. మరో వైపు గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ నిఖిల్ ఎస్ కరీల్ ను బదిలీకి సిఫార్సు చేసినట్టు ప్రచారం జరిగినా హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ జాబితాలో ఆయన పేరు లేదు. నిఖిల్ ఎస్ కరీల్ ను గుజరాత్ నుంచి పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్టు కొలీజియం సిఫార్సు చేసిందని పలు మీడియా కథనాలు ప్రసారాలు చేయడంతో ఈ సిఫార్సును వ్యతిరేకిస్తూ గుజరాత్ హైకోర్టు అడ్వకేట్స్ ఆందోళనకు దిగారు. అయితే తాజాగా కొలీజియం సిఫార్సు చేసిన బదిలీ జాబితాలో జస్టిస్ నిఖిల్ ఎస్ కరీల్ పేరు లేదు. అయితే బదిలీని ఆపాలని కోరినప్పటికీ అభిషేక్ రెడ్డిని పాట్నాకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది.