TS: కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు

by GSrikanth |   ( Updated:2023-12-05 10:16:26.0  )
TS: కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా గెలిచిన అభ్యర్థులకు పాలన విధానాలపై శిక్షణ తరగతులు ఇవ్వనున్నారు. కాంగ్రెస్ నుంచి కొత్తగా చాలా మంది ఎమ్మెల్యేలుగా ఎన్నిక అయ్యారు. అయితే వారికి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇవ్వనున్నారనేది తెలియాల్సి ఉంది. గెలిచిన ఎమ్మెల్యేలు కొత్త వారు కావడంతో పాలన విధానం, హక్కులు, బాధ్యతలు లాంటి వివిధ విషయాలపై శిక్షణ ఇప్పించనున్నారు. అయితే ఈ ట్రైనింగ్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్, మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వీరికి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది.

Advertisement

Next Story