TPCC: కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పు నెత్తిన పెట్టిండు.. టీపీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్

by Ramesh Goud |
TPCC: కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పు నెత్తిన పెట్టిండు.. టీపీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్(KCR) ఏడు లక్షల కోట్ల అప్పు నెత్తిన పెట్టి పోయినా.. ఆటుపోట్లను ఎదుర్కొంటూ విజయవంతంగా బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, టీపీసీసీ ప్రెసిడెంట్(TPCC President) మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాయమాటలు చెప్పే కేసీఆర్ పాలనకు, మా కాంగ్రెస్ పాలన(KCR Governance)కు చాలా తేడా ఉంటుందన్నారు. ప్రజలు ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ మార్క్ పాలనను చూశారని, తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను(SIX Garentees) అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

కేసీఆర్ సుతిలేని సంసారం నడిపి 7 లక్షల కోట్ల అప్పు పెట్టి పోయాడని, ఆర్థిక నిర్భంధం ఎంత ఉన్నా సర్దుకోని ముందుకు పోతున్నామని చెప్పారు. రానున్న నాలుగేళ్లలో ఏ రాష్ట్రం చేయలేనంతగా అభివృద్ధి చేసి ప్రజలకు బంగారు తెలంగాణ అంటే ఏంటో చూపిస్తామని అన్నారు. అలాగే ధరణి(Dharani Portal)ని సమూలంగా మార్పులు చేశామని, గతంలో కలెక్టర్లు, ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఎమ్మార్వో తో పనులు అయ్యే వెసులుబాటు కల్పించామని తెలిపారు. రాష్ట్రంలో భూమి విషయంలో ఏ బీదవాడికి అన్యాయం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు.

Advertisement

Next Story