నవంబర్ 30 BRS ఎక్స్‌పైరీ డేట్.. కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరు: రేవంత్ రెడ్డి

by Satheesh |   ( Updated:2023-11-10 16:56:08.0  )
నవంబర్ 30 BRS ఎక్స్‌పైరీ డేట్.. కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరు: రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: నవంబర్ 30 బీఆర్ఎస్‌కు ఎక్స్‌పైరీ డేట్.. ఇక సీఎం కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన ఓ చానెల్ డిబేట్‌లో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణలో సామాజిక న్యాయం స్వేచ్చ లేదని.. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే రాత్రికి రాత్రే తీసుకెళ్లి జైల్లో వేశారని చెప్పారు. అసలు తెలంగాణలో స్వేచ్చ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నేరవేరలేదని.. కేసీఆర్ తన సొంత ఆలోచనలను ప్రజలపై రుద్దాలని చూశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుందని.. బీఆర్ఎస్‌లో అలాంటి పరిస్థితి లేదని అన్నారు. బీఆర్ఎస్‌లో సీఎం అవుతానని చెప్పే దమ్ము మంత్రి హరీష్ రావుకు ఉందా అని ప్రశ్నించారు. అలా చెప్పిన తెల్లారే హరీష్ జైల్లో ఉంటాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్టీ ఫిరాయింపుదారులకు, కాంట్రాక్టర్లు, డబ్బున్న వారికే కేసీఆర్ పదవులు ఇచ్చాడని ఫైర్ అయ్యారు. వేల కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తులకు రాజ్యసభ పదవులు ఇచ్చారని మండిపడ్డారు.

Advertisement

Next Story