- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్రేకింగ్: ఈడీ కార్యాలయం నుండి బయటకు వచ్చిన కవిత.. నేరుగా అక్కడికే పయనం
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మూడవ రోజు ఈడీ విచారణ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారుల బృందం వరుసగా ఇవాళ రెండవ రోజు ప్రశ్నించింది. ఇవాళ దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ ఈ రోజు విచారణ ముగిసిందని ప్రకటించింది. అనంతరం కవిత ఈడీ ఆఫీస్ నుండి బయటకు వచ్చారు. ఈడీ కార్యాలయం నుండి చిరునవ్వుతో బయటకు వచ్చిన కవిత అభిమానులకు, కార్యకర్తలకు విక్టరీ సింబల్ చూపిస్తూ కారులో ఇంటికి బయలుదేరారు.
ఇక ఉదయం 11.30 గంటలకు మొదలైన విచారణ.. రాత్రి 9.40 గంటలకు ముగిసింది. దాదాపు ఇవాళ ఈడీ అధికారులు కవితను పది గంటల పాటు ప్రశ్నించారు. సౌత్ గ్రూప్, పిళ్లై, బుచ్చిబాబులతో గల సంబంధం, ఫోన్ల ధ్వంసంపైనే అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఇక, ఈడీ కార్యాలయం నుండి బయటికి వచ్చిన కవిత నేరుగా ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ అధికారికి నివాసానికి వెళ్లారు.
Read more :
నడి రోడ్డుపై నగ్నంగా తిరిగిన నటి.. పోలీసులకు ఫోన్ చేసి మరీ
బిగ్ బ్రేకింగ్: రెండవ రోజు ముగిసిన కవిత ఈడీ విచారణ.. తీవ్ర ఉత్కంఠకు తెర!