సమస్య తీర్చాలంటూ.. రోడ్డెక్కిన కేయూ విద్యార్థులు

by Sathputhe Rajesh |
సమస్య తీర్చాలంటూ.. రోడ్డెక్కిన కేయూ విద్యార్థులు
X

దిశ, హన్మకొండ: వేల రూపాయలు ఫీజులు కట్టిన హాస్టల్ వసతి కల్పించడం లేదని బువ్వ కోసం విద్యార్థులు రొడెక్కారు. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో చదువుకొంటున్న విద్యార్థినిలు గత కొన్ని రోజులుగా హాస్టల్ వసతి కల్పించాలని వి.సి.రమేష్‌ను కలసి సమస్యను తెలిపారు. నిరుపేద కుటుంబంలో పుట్టి చదువు కోవాలని ఎన్నో కష్టాలను అధిగమించి కేయూలో సీటు సంపాదించామని తల్లి దండ్రులు కాయ కష్టం చేసి వచ్చిన కూలి పైసలతో వేల రూపాయల ఫీజులు కట్టి హాస్టల్ వసతి కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు 40 మంది విద్యార్థినిలు రాస్తారోకో, నిరసన వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడిందన్నారు. విషయం తెలుసుకొన్న సుబేదారి పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థినిలు సమస్యను విన్నారు. విద్యార్థినిల సమస్యలు తెలిపేందుకు కలెక్టర్ కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డు కున్నారు. దీంతో విద్యార్థినులకు పోలీస్‌లకు మధ్య చిన్న పాటి తోపులాట జరిగింది. పోలీసులు విద్యార్థిలను పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. ఈ సందర్బంగా విద్యార్థినిలు కంటతడి పెట్టుకున్నారు.

లక్షల రూపాయలు జీతం తోసుకుంటున్న యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల సమస్యలను తీర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివి అందుకు యూనివర్సిటీలో సీటు తెచ్చుకుంటే ఆకలి బాధతో చదువు లేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు యూనివర్సిటీ అధికారులను వీసీని కలసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకుందాం అంటే కలెక్టర్ అనుమతి ఇవ్వక పోవడం బాధాకరమన్నారు. యూనివర్సిటీలో హాస్టల్ సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ విద్యార్థినిలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు.

Advertisement

Next Story

Most Viewed