Hyderabad Metro : రేపు అన్ని రూట్లలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

by M.Rajitha |   ( Updated:2024-09-16 14:20:49.0  )
Hyderabad Metro : రేపు అన్ని రూట్లలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరంలో జరిగే గణేష్ నిమజ్జనాల వేళ మెట్రో(Metro) రైళ్ల సమయం పొడిగించారు. 17వ తేదీన అన్ని మెట్రో రూట్లలో అర్థరాత్రి సమయం వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని ప్రారంభ మెట్రో స్టేషన్ల నుండి చివరి రైలు రాత్రి 1 గంటకు బయలుదేరి, రాత్రి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించారు. రద్దీని బట్టి ఖైరతాబాద్, లక్డీకపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అన్ని మెట్రో స్టేషన్లలో మహిళల భద్రతకు అదనపు పోలీసులను కూడా నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. నిమజ్జనాలను చూసేందుకు తరలి వచ్చే భక్తులు మెట్రో రైలు సేవలను ఉపయోగించుకోవాలని ప్రయాణికులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed