మరో మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు!.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షం

by Ramesh Goud |
మరో మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు!.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరి ముఖ్యంగా శనివారం భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ప్రకటన విడుదల చేసింది. ఈ ఆవర్తన ప్రభావం ఉత్తర తెలంగాణపై ఎక్కువగా పడనుందని, దీంతో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల నిర్మల్, పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అంతేగాక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదుడు గాలులు వీస్తాయని, వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed