Breaking News: మరో ముగ్గురు అరెస్ట్.. పరారీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

by Ramesh Goud |   ( Updated:2024-01-17 12:41:43.0  )
Breaking News: మరో ముగ్గురు అరెస్ట్.. పరారీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: ప్రగతి భవన్ వద్ద కారు ప్రమాదం కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన అరభాస్, సోహెల్, ఆసిద్ లను నిందితులుగా పరిగణించి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో మరో 10 మందిని అనుమానితులుగా బావిస్తున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సాహిల్, అతని తండ్రి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్, ఇతర నిందితులు జక్రియ, షాహిద్, అస్లాం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా గత నెల 23న సాహిల్ ప్రజాభవన్ వద్ద కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల పేర్లు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ప్రధాన నిందితుడు సాహిల్ దుబాయ్ పారిపోగా, అతని తండ్రి షకీల్ పై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

Next Story

Most Viewed