- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
V.C. Sajjanar: పండుగ పూట ఇదేం వికృతానందం: క్రాకర్స్ తో బైక్ విన్యాసాలపై సజ్జనార్ ఫైర్
దిశ, వెబ్ డెస్క్/ శేరిలింగంపల్లి : పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పోకిరీలు తమ తీరు మార్చుకోవడం లేదు. వీకెండ్ వచ్చిందంటే చాలు ఐటీ కారిడార్ లో బైక్ లతో రెచ్చిపోతున్నారు. నగరంలోని ఆయా ప్రాంతాల నుండి మాదాపూర్ ఐటీ కారిడార్ కు వచ్చి మరీ బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్నారు. పలుమార్లు పోలీసులు కేసులు నమోదు చేసినా వారు తీరు మార్చుకోవడం లేదు. తాజాగా దీపావళి సందర్భంగా టపాసులను బైక్ లకు కట్టుకుని మరీ రేసింగ్ లకు పాల్పడ్డారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఘటనపై సీనియర్ ఐపీఎస్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీ.సీ. సజ్జనార్(V.C. Sajjanar) సీరియస్ గా స్పందించారు. దీపావళి(Diwali) పండుగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజమంటూ(society) మరోసారి యువత వెర్రి పోకడలపై మండిపడ్డారు. రన్నింగ్ బైక్ పై క్రాకర్స్ కాలుస్తూ రహదారిపైన యువకుడి స్టంట్స్ వీడియోను ట్వీట్ చేసిన సజ్జనార్ యువతరం వెర్రిచేష్టలపై అసహనం వ్యక్తం చేశారు. దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినమని, పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
యువత అసాంఘిక పోకడలపైన, వీధుల్లో, ట్రైన్లలో డ్యాన్స్ లు చేయడం, సెల్ఫీలు, రీల్స్ కోసం చేసే అతిచర్యలపై తరుచు ట్విటర్ వేదికగా స్పంందించే సజ్జనార్ పెట్టిన తాజా వీడియో పోస్టు నెటిజన్లను ఆలోచింప చేస్తూ వారి ప్రశంసలతో సాగుతూ వైరల్ గా మారింది.