Musi Yatra : సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర రూట్ మ్యాప్ ఇదే.. ఎంపీ చామల వెల్లడి

by Ramesh N |   ( Updated:2024-11-07 08:29:46.0  )
Musi Yatra : సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర రూట్ మ్యాప్ ఇదే.. ఎంపీ చామల వెల్లడి
X

దిశ, డైనమిక్/ తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) మూసీ ప్రాంత పర్యటనకు సర్వం సిద్ధం అయింది. రేపు పుట్టిన రోజు సందర్భంగా, మూసీ ప్రాంతంలో (Musi Yatra) సీఎం రేవంత్ పాదయాత్ర నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy), సీఎం రేవంత్ రెడ్డి రేపటి పర్యటన వివరాలు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా రేపు కుటుంబ సమేతంగా హెలికాప్టర్‌లో ఉదయం 8:45 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. స్వామి వారి దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం 10:00 గంటలకు వైటీడీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు.

మధ్యాహ్నం 1:00 గంటలకు వలిగొండ మండలం సంగెం గ్రామం చేరుకుంటారు. మూసీ పరివాహక ప్రాంత రైతులతో మూసీ నది వెంట పాదయాత్ర ద్వారా భీమ లింగం, ధర్మారెడ్డి కాల్వలను సందర్శిస్తారని తెలిపారు. అనంతరం మూసీ పరివాహ ప్రాంతం (Farmers) రైతులతో సమావేశం అవుతారని, మూసీ మురికి కూపంలో కొట్టుమిట్టాడుతున్న రైతుల యోగా క్షేమాలు అడిగి తెలుసుకుంటారని వివరించారు. రైతులతో సమావేశం అనంతరం తిరిగి (Hyderabad) హైదరాబాద్ బయలుదేరుతారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Next Story