Breaking: టీడీపీ, జనసేన ఎంపీలకు విప్ జారీ

by srinivas |   ( Updated:1 April 2025 2:45 PM  )
Breaking: టీడీపీ, జనసేన ఎంపీలకు విప్ జారీ
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో బుధవారం వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరగనుంది. దీంతో ఎన్టీఏ కూటమి ఎంపీలంతా సభకు హాజరుకావాలని కేంద్ర ప్రభుత్వం విప్ జారీ చేసింది. ఏపీ టీడీపీ, జనసేన ఎంపీలకు సైతం విప్ జారీ చేసింది. లోక్ సభ సమావేశాలకు తప్పక హాజరుకావాలని సూచించింది.

కాగా ఈ బిల్లుకు కూటమి ఎంపీలు మద్దతు తెలుపుతున్నారు. ఇండియా కూటమి ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. అయితే లోక్ సభ, రాజ్య సభలో ఎన్డీయే కూటమితో మెజార్టీగా ఉంది. ఈ బిల్లుకు లోక్‌సభలో అనుకూలంగా 298 మంది ఎంపీలు ఓటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 233 మంది ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. 11 మంది ఎంపీలు తటస్టంగా ఉండాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక రాజ్యసభలో ఎన్డీయేకు 122, విపక్షాలకు 116 ఎంపీల బలం ఉంది. దీంతో ఉభయసభల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు సులువుగా ఆమోదముద్ర పడే అవకాశం ఉందని అంటున్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed