- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Hyd: ఎమ్మెల్యే దానం మళ్లీ హల్ చల్.. కూల్చివేతలను అడ్డుకుని అధికారులపై ఆగ్రహం

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ చింతల్ బస్తీ(Chintal Basti)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. షాదన్ కాలేజీ(Shadan College) ఎదురుగా ఉన్న రోడ్డులో అక్రమ నిర్మాణాలను కూల్చివేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. అయితే అధికారులను ఎమ్మెల్యే దానం నాగేందర్ అడ్డుకున్నారు. తన అనుమతులు లేకుండా ఎలా కూల్చుతారంటూ హల్ చల్ చేశారు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్లు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూల్చివేతలు వెంటనే నిలిపివేయాలని, లేనిపక్షంలో ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. అధికారులు అర్ధం చేసుకోవాలని.. తమరు చేసే పనులతో పార్టీ పరువుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Next Story