- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు.. మృతదేహాలను అడ్డుకున్న గ్రామస్థులు
దిశ, వైరా : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి మండలంలోని చీమలపాడు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి మృతదేహాలను గ్రామంలోకి రాకుండా గ్రామస్తులు, బంధువులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చీమలపాడు కు చెందిన అజ్మీర మంగు, స్టేషన్ చీమలపాడు కు చెందిన బానోత్ రమేష్ మృతికి బీఆర్ఎస్ పార్టీయే కారణమని గ్రామస్తులు, మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం స్పష్టమైన ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించేంతవరకు మృత దేహాలను గ్రామంలోకి రానివ్వమని పట్టుబట్టారు. ఈ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన మంగు, రమేష్ మృతదేహాలను పోలీస్ ఎస్కార్ట్ తో అంబులెన్స్ లో ఖమ్మం నుంచి చీమలపాడు గ్రామానికి తీసుకువచ్చారు.
అయితే చీమలపాడు గ్రామం ప్రారంభమయ్యే ప్రాంతంలో పోలీస్ ఎస్కార్ట్ తో వస్తున్న అంబులెన్స్ ను గ్రామస్తులు, మృతుల బంధువులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో చంద్రశేఖర్ ఎక్స్ గ్రేషియా విషయమై ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే తమకు లిఖితపూర్వకంగా ఎక్స్ గ్రేషియా హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దీంతో జాయింట్ కలెక్టర్ మధుసూదన్, అడిషనల్ ఎస్పీ బోసు హుటాహుటిన చీమలపాడు గ్రామానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారితో చర్చించారు. ప్రభుత్వం తరఫున ఒక్కో మృతుడు కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని జేసీ స్పష్టమైన హామీ ఇచ్చారు.
అంతేకాకుండా మృతుల కుటుంబాలను చదువుకున్న పిల్లలు ఉంటే వారికి అవుట్సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కో మృతుడి కుటుంబానికి 10 లక్షలు రూపాయలు ఆర్థిక సహయం చేస్తామని పార్టీ నేతలు ప్రకటించారు. సుమారు రెండు గంటల పైగా వారు గ్రామ సమీపంలో ఆందోళన చేశారు. జేసీ స్పష్టమైన హామీతో గ్రామస్తులు, మృతుల బంధువులు ఆందోళన విరమించారు. ఆందోళన సందర్భంగా గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అని అధికారులతో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆందోళన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వా రెడ్డి, వైరా ఏసీపీ రెహమాన్ పోలీస్ సిబ్బందితో పరిస్థితిని చక్కదిద్దారు.