- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRS ఆవిర్భావ సభకు బ్రేక్.. ఏప్రిల్ 27 ఇక చరిత్రకే పరిమితమా?
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ సభకు ఈ సారి బ్రేక్ పడే చాన్స్ ఉన్నది. ఎన్నికల ప్రచారంలో బిజీ ఉండడం, ఎలక్షన్ కోడ్ ఉంటుందనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తున్నది. జులై తర్వాత ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చనే ప్రచారం జరుగుతున్నది. దీంతో ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం సాధ్యం కాదనే అభిప్రాయం వినిపిస్తున్నది.
ఏప్రిల్ 27 ఇక గతమే..
గులాబీ పార్టీలో ఏప్రిల్ 27కు ఓ ప్రత్యేకత ఉన్నది. ఆ రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేవారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చుకున్న తర్వాత ఏప్రిల్ 27కు ప్రత్యేకత లేదని పార్టీ లీడర్లు చెప్తున్నారు. ఏప్రిల్ 27 ఇక చరిత్రకే పరిమితమని ఆవేదన చెందుతున్నారు. పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చడాన్ని తెలంగాణ ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొంటున్నారు.
మూడోసారి పవర్ లోకి వస్తే భారీ సభ
ఒకవేళ అక్టోబరు 5 పార్టీ ఆవిర్భావం దినోత్సవం లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయి, మూడోసారి అధికారంలోకి వస్తే ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తున్నది. ఎన్నికలు లేకున్నా.. ప్రచార పర్వంలోనే ఎక్కడికక్కడ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించే యోచనలో ఉన్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టుగా జరిగి, మూడోసారి పవర్‌లోకి వస్తే, వెంటనే పెద్ద ఎత్తున ప్రజా కృతజ్ఞత సభ నిర్వహించి, లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.
ఇవి కూడా చదవండి: ఈసారి గ్రాండ్‌గా అంబేద్కర్ జయంతి.. ఊహించని రేంజ్‌లో ప్లాన్!