Hydra Fear: భయంతో మహిళ సూసైడ్.. స్పందించిన హైడ్రా కమిషనర్

by Kavitha |
Hydra Fear: భయంతో మహిళ సూసైడ్.. స్పందించిన హైడ్రా కమిషనర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైద్రాబాద్‌లో హైడ్రా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెెలిసిందే. చెరువులను ఆక్రమించుకొని నిర్మించుకున్న కట్టడాలను.. నోటీసులు ఇచ్చి మరీ హైడ్రా కూల్చేస్తుంది. అందుకే హైడ్రా పేరు చెబితేనే అక్రమార్కులు హడలెత్తి పోతున్నారు. అదే టైంలో చెరువులకు సమీపంలో ఇళ్లు నిర్మించుకున్న వాళ్లు కూడా భయపడుతున్నారు. ఎప్పుడు హైడ్రా బుల్డోజర్ల తమ ఇళ్ల పైకి వస్తాయో అని కంగారు పడుతున్నారు. ఇలాంటి కంగారుతోనే ఎక్కడ తన ఇళ్లు కూల్చివేస్తారనే భయంతో కూకట్‌పల్లిలోని యాదవ బస్తీలో నివాసం ఉంటున్న గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ సూసైడ్ చేసుకుంది. ఆమెకున్న ముగ్గురు కుమార్తెలకు చెరో ఇంటిని రాసి ఇచ్చింది. ఇవి చెరువుకు సమీపంలో ఉండడంతో హైడ్రా కూల్చేస్తుందేమో అని మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

అయితే బుచ్చమ్మ ఆత్మహత్య గురించి తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిపై స్పందించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. "హైడ్రా ఎవరికి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. బుచ్చమ్మ హత్మహత్య పై కూకట్‌పల్లి ఎస్‌ఐతో మాట్లాడాను. శివయ్య దంపతుల కూతుర్లకు రాసిచ్చిన ఇళ్లు కూకట్‌పల్లి చెరువుకు సమీపంలో ఉన్నప్పటికీ ఎఫ్‌టిఎల్ పరిధికి దూరంగా ఉన్నాయి. కూల్చి వేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారనే భయంతో వారి కూతుళ్లు బుచ్చమ్మను ప్రశ్నించారు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో హైడ్రాకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే హైడ్రా గురించి మీడియాలో కానీ, సామాజిక మాద్యమాల్లో గానీ భయాలు పట్టించవద్దని కోరుతున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న కూల్చివేతను హైడ్రాకు ఆపాదిస్తున్నారు. కూల్చివేతలకు సంబంధించి మూసీ పరిధిలో చేపట్టిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదు. మూసీ నదిలో శనివారం భారీగా ఇళ్లను కూల్చివేయబోతున్నట్లు ఫేక్ న్యూస్ బాగ్ స్ప్రెడ్ అవుతుంది. కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రత్యేక ఎజెండాతో హైడ్రాపై అవాస్తవ, నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయాన్ని మీడియానే ప్రజల్లోకి తీసుకెళ్లాలి. హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు వద్దు. పేదలు, మధ్యతరగతి ప్రజలు కూల్చివేతల వల్ల ఇబ్బందులు పడవద్దని, దీనికి సంబంధించి ప్రభుత్వం కచ్చితమైన సూచనలు జారీ చేసింది" అని రంగనాథ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story