పెళ్లింట తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు

by GSrikanth |
పెళ్లింట తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం ప్రయాణిస్తోన్న ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని ఆందోల్ మండలం మన్సాన్‌పల్లి గ్రామ శివారులో బుధవారం మధ్యాహ్నం జరిగింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి అంబులెన్సులకు ఫోన్ చేశారు. హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్న పోలీసుల క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story