- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్ట్ సంచలన తీర్పు.. సిట్ కీలక నిర్ణయం..!
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సోమవారం అనుహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తదుపరి విచారణను సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ విచారణపై నమ్మకం లేదని.. కేసు దర్యాప్తు జరుగుతుండగానే సమాచారం లీక్ అవుతున్నదని.. ఈ కేసును సీబీఐకు అప్పచెప్పాలంటూ గతంలో బీజేపీ, ముగ్గురు నిందితులు దాఖలు చేసిన పిటిషన్లలను హైకోర్టు సుదీర్ఘంగా విచారించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ విచారణ సరిగ్గా జరగడం లేదనే వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు తదుపరి విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు ఆదేశించింది. అంతేకాకుండా సిట్ ఏర్పాటును కూడా కొట్టి వేసిన హైకోర్టు.. సిట్ దర్యాప్తును కూడా నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తదుపరి దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని సిట్ నిర్ణయించుకుంది.
ఇవి కూడా చదవండి : MLA poaching case: బ్రేకింగ్: మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు..