Power Cut : సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో వవర్ కట్‌! నిలిచిన సేవలు.. ఎందుకంటే?

by Ramesh N |   ( Updated:2024-10-18 10:48:56.0  )
Power Cut : సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో వవర్ కట్‌! నిలిచిన సేవలు.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని నాంపల్లి రెడ్‌హిల్స్‌లో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో భవన యజమాని కరెంటు కట్‌ చేశారు. దాదాపు 6 నెలలుగా అద్దె, కరెంట్ బిల్లు చెల్లించట్లేదని భవన యజమాని ఖురేషి ఆరోపణలు చేశారు. వెంటనే భవనం ఖాళీ చేయాలని భవన యజమాని ఖురేషి వారిని కోరారు. ఈ క్రమంలోనే బిల్డింగ్ ఓనర్ కార్యాలయానికి తాళం వేయడానికి కూడా ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో కరెంట్‌ లేకపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది.

రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, ఇటీవల గురుకుల పాఠశాల ప్రైవేట్ భవనాలకు కూడా అద్దె చెల్లించకపోవడంతో కొంతమంది యజమానులు కొన్ని పాఠశాలలకు తాళం వేశారు. దీంతో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. తాజాగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు కూడా అద్దె చెల్లించకపోవడంతో యజమాని కరెంట్ కట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story