- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరసనలో కాలికి గాయమైన వ్యక్తిని లాక్కెళ్లిన పోలీసులు!.. ఫ్రెండ్లీ పోలీసింగ్ పై మండిపడుతున్న నెటిజన్లు
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రమంత్రి ఇల్లు ముట్టడి ఘటనలో పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ విద్యార్ధిసంఘ నాయకుడు కాలు నొప్పితో బాధపడుతున్నానని చెప్పిన వినకుండా పోలీసులు లాక్కెళ్లారు. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. నీట్ పేపర్ లీకేజీపై నిరసన వ్యక్తం చేస్తూ.. నీట్ ఎగ్జామ్ ను మళ్లీ నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎస్, పీడీఎస్ఎస్‌యూ విద్యార్ధి సంఘాల నాయకులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులకు విధ్యార్ధి నాయకులకు జరిగిన తోపులాటలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పై ఒకే సారి పదిమంది వచ్చిపడటంతో అతడి కాలికి గాయం అయ్యింది.
తోపులాట అనంతరం విద్యార్ధిసంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే గాయంతో బాధపడుతున్న లక్ష్మణ్ పక్కకు వెళ్లి కూర్చున్నాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు వచ్చారు. దీనిపై కాలికి గాయం అయ్యిందని చెప్పిన వినకుండా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. మరో ఉన్నతాధికారి వచ్చి తీసుకెళ్లండి అని ఆదేశాలివ్వడంతో మరో ముగ్గురు పోలీసులు అతన్ని ఎత్తుకొని వెళ్లి పోలీస్ వ్యాన్ లో వదిలేశారు. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ ఘటనలో పోలీసులు ప్రవర్తనపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా.. కాలికి గాయం అని అలా తీసుకొని వెళ్లడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.