పింక్ మీడియాకి పిచ్చి ముదిరింది.. రహస్య భేటీ వార్తలపై స్పందించిన ప్రభుత్వ విప్

by Ramesh Goud |
పింక్ మీడియాకి పిచ్చి ముదిరింది.. రహస్య భేటీ వార్తలపై స్పందించిన ప్రభుత్వ విప్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ వార్తలపై ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Government Whip Beerla Ailaiah) స్పందించారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన.. తనపై దుష్ప్రచారం పట్ల ఏసీపీ (ACP)కి ఫిర్యాదు (Complaint) చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా (Social Media)లో కొందరు వ్యక్తులు తనపై తప్పుడు వార్తలు (Fake News) ప్రచారం చేస్తూ.. తన వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు. అలాగే తాను ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నానని, తనకు ప్రజల నుండి వస్తున్న మద్దతును జీర్ణించుకోలేక కొన్ని శక్తులు పని కట్టుకొని ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా వార్తలను ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

ఇక సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం కేసు (Case) నమోదు చేసి, వెంటనే చర్యలు (Action) తీసుకోవాలని, భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వాళ్లకి పిచ్చి ముదిరిందని, కాంగ్రెస్ పార్టీ (Congress party)ని బదనాం చేయాలని వారి పింక్ మీడియా (Pink Media) ద్వారా రోజుకొక కథనం సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLAs) రహస్యంగా భేటీ (Meeting) అయ్యారని ప్రచారం చేశారని చెప్పారు.

అంతేగాక బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) మా ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక మా ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేలతో మీటింగ్ కి వెళ్లానని పింక్ మీడియా ద్వారా ప్రచారం చేయించారని, కానీ తాను సొంత నియోజకవర్గంలో ఓ కార్యకర్త ఇంట్లో పెళ్లికి హాజరయ్యానని తెలిపారు. మీరు ఎన్ని ప్రచారాలు చేసిన మీ నూకలు తెలంగాణలో చెల్లవని చెప్పారు. తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు సహకరించుకొని అభివృద్ధి పథం వైపు వెళుతుంటే చూసి ఓర్వలేక సిగ్గుమాలిన పనులు చేస్తున్నారని అన్నారు. ఇక దీనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా సైబర్ క్రైం ఏసీపీ (Cyber Crime ACP)కి ఫిర్యాదు చేసినట్టు ఐలయ్య వెల్లడించారు.

Next Story

Most Viewed