విషాదం.. ఉపాధినిచ్చే వల ఉసురు తీసింది

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-09 04:52:00.0  )
విషాదం.. ఉపాధినిచ్చే వల ఉసురు తీసింది
X

దిశ, లోకేశ్వరం: ఆ కుటుంబానికి అతనే పెద్దదిక్కు, నిత్యం ఆయన ఉపాధి కెళ్తేనే ఆ కుటుంబం పూట గడిచేది. కానీ ఉపాధినిచ్చే వల ఆ వ్యక్తి ఉసురు తీయడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు, ఎస్ఐ సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సాథ్‌గాం గ్రామానికి చెందిన తోకల నరేష్ (26) అనే మత్స్యకారుడు బుధవారం గడ్‌చాంధ ప్రాంతంలో గల గోదావరి నదిలోకి చేపల వేటకు వెళ్ళాడు.

కాగా సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడం, మొబైల్ ఫోను ఎత్తకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై గోదావరి పరివాహక ప్రాంతానికి వెళ్లి వెతకగా, గోదావరి నది ఒడ్డున ఆయన ద్విచక్ర వాహనం, దుస్తులు కనిపించాయి. దీనితో నదిలో గాలించగా చేతులకు, కాళ్లకు వల చుట్టుకున్న మృతదేహం లభ్యమైందని ప్రమాదవశాత్తు జరిగి ఉండవచ్చని అన్నారు. మృతుని భార్య హరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story