- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రైవేట్రంగంలోనూ రిజర్వేషన్లకు కృషి: ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేట్రంగంలోనూ రిజర్వేషన్ల అమలుకు ప్రయత్నం చేయాలని లండన్గ్లోబల్ అంబేద్కర్రైట్స్ కన్వెన్షన్ తీర్మానించింది. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిర్మూలనకు కృషి చేసేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని, ఈ మేరకు న్యాయవాదుల సహకారాన్ని తీసుకోవాలని ప్లాన్ చేశారు. లండన్‌లో ఈ నెల 13 నుంచి15 వరకు జరిగిన ' గ్లోబల్ అంబేద్కరైట్స్ కన్వెన్షన్ 2022' సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, ఆర్థిక వృద్ధిపై పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోని పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫండ్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రైవేట్ రంగంలో అపర్మేటివ్ యాక్షన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బహుజన వర్గాలకు రిజర్వేషన్లు అమలుకు రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సిందిగా తీర్మానించామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కోసం ప్రత్యేక నిధులు జమ చేస్తామన్నారు. బహుజన బ్యాంకును ఏర్పాటు చేస్తూ, ప్రతి గ్రామంలో దళిత కో ఆపరేటివ్ సొసైటీలో ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు స్పష్టం చేశారు. ఇక మహిళా ఎంపవర్‌మెంట్ సెల్, ఐటీ సెల్‌కు ప్లాన్ చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో దళితులకు అవగాహన కల్పించి దిశా నిర్ధేశం చేస్తామన్నారు.