- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టీఎస్ ఆర్టీసీ, నిమ్స్ ఒప్పందం
by Javid Pasha |

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిని నిమ్స్ తో అనుసంధానం చేయనున్నారు. తార్నాకలోని సీరియస్ కేసులకు ఇక నుంచి నిమ్స్ లో అడ్మిషన్లు ఇచ్చి వైద్యం అందించనున్నారు. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీరప్ప మాట్లాడుతూ..ఆర్టీసీ ఉద్యోగులకు ఇక నుంచి వైద్యం విషయంలో ఎలాంటి టెన్షన్అవసరం లేదని, సీరియస్కేసులను నిమ్స్ లోని స్పెషల్ వార్డులో చికిత్సను అందిస్తామన్నారు. ఏ సమస్యతో వచ్చినా స్పెషల్ కేర్ తీసుకుంటామని చెప్పారు. అయితే ఆస్పత్రి చెల్లిపులను వేగంగా మంజూరు చేసేలా చొరవ తీసుకోవాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప కోరారు. ఈ కార్యక్రమంలోనిమ్స్ క్రెడిట్ కలెక్షన్ ఇంఛార్జి శ్రీధర్, సురేష్ ఉన్నారు.
Next Story