- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలి రోజు ‘‘పది’’ పరీక్ష గందరగోళం.. పేపర్ లీక్ ఘటనతో విద్యార్థులు ఆందోళన!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు తొలిరోజు కాస్త గందరగోళం మధ్య జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1 లో ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఏడు నిమిషాలకే తెలుగు పేపర్ అక్కడి వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. దీంతో అక్కడ కాస్త గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ వ్యవహారంతో రాష్ట్రవ్యాప్తంగా సెంటర్ల దగ్గర కూడా అధికారులు అలెర్ట్ అయ్యారు.
తెలంగాణ వ్యాప్తంగా 2,652 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. పది పరీక్షలకు పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులను గంట ముందే సెంటర్‌లోకి పంపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులనూ సైతం హాల్లోకి అనుమతించారు. రాష్ట్రవ్యాప్తంగా రెగ్యూలర్, ప్రైవేట్ కలిపి 484,885 మంది విద్యార్థులు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు హాజరైనారు. రెగ్యూలర్ విభాగంలో విద్యార్థులు 99.60 శాతం మంది, ప్రైవేటుగా 79.01 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.