- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ అప్పుడే.. వారికే ప్రాధాన్యత..
దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ భారీగా విజయం సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులు, కార్యచరణపై గాంధీభవన్‌లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, పీఈసీ సభ్యులు హాజరు అయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసే ఆశావాహుల లిస్ట్ డీసీసీల నుంచి పీసీసీ తీసుకుంది.
ఈ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ పీఈసీ మీటింగ్ తర్వాత.. కొన్ని రోజులకు స్క్రీనింగ్ కమిటీ మిటింగ్ ఉంటుందని, ఫిబ్రవరి మధ్యలో సెంట్రల్ ఎలక్షన్‌లో టికెట్లు ఫైనల్ అవుతాయన్నారు. గెలిచే అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నామని మంత్రి ఉత్తమ్ స్పష్టంచేశారు.