- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జింక దూకింది.. పిట్ట ఎగిరింది.. వైన్స్‌లు ఖాళీ అయ్యాయి!!

X
దిశ, రాచకొండ : వైన్స్‌లు ఖాళీ అయ్యాయి. ఎన్నికల పుణ్యమా అని వైన్స్ యజమానులు నష్టాల నుంచి బయటపడ్డారు. కొత్త దుకాణం ఏర్పాటు సమయంలో మిగిలిన స్టాక్‌ను ఎలా సర్దుబాటు చేయాలానే టెన్షన్ తప్పింది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల నిబంధనల ప్రకారం 30వ తేదీ సాయంత్రం వరకు వైన్స్‌లు బంద్. ఇక డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్, కొత్త కోడ్ తో నూతన దుకాణాల ద్వారా అమ్మకాలు ప్రారంభమవుతాయి.
ఎన్నికల నేపథ్యంలో మొత్తానికి స్టాక్ మొత్తం ఊడుచుకుపోయింది. అదే విధంగా లైసెన్స్ ఫీజుకు అనుగుణంగా ఉండే టర్న్ఓవర్ సేల్స్ పూర్తయి, ఇంకా అధికంగా అమ్మకాలు జరగడంతో టార్గెట్ పూర్తి కాని వైన్స్‌లు కూడా లాభాల బాటలో పడ్డాయి. ఎన్నికల వేళ అధికంగా జింక దుంకింది( రాయల్ స్టాగ్ ), పిట్ట(కింగ్ ఫిషర్) ఎగిరిందని వైన్స్ యజమానులు ఖుష్ అవుతున్నారు.
Next Story