- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రూ.56.18 కోట్లతో నియోజవర్గ అభివృద్ధి.. : భువనగిరి ఎమ్మెల్యే
by Aamani |

X
దిశ, యాదాద్రి కలెక్టరేట్ : భువనగిరి నియోజకవర్గాన్నిరూ. 56.18 కోట్ల హెచ్ఎండిఏ నిధులతో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని సమ్మద్ చౌరస్తా షాప్ నం 3 వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏనాడు పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన చేయలేదని విమర్శించారు. కూలిపోయే ప్రాజెక్టుల మీద డబ్బును ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల హాస్టళ్లలో విద్యార్థులకు మెస్ ఛార్జీలను 40 శాతం కి పైగా పెంచారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, ఆర్డిఓ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేఖ బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Next Story