- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముగిసిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారం.. ఒక్కసారిగా మూగబోయిన మైకులు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ప్రచార ప్రక్రియ ముగిసింది. చివరి నిమిషం వరకు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నించారు. ఇక ఓటు వేయడం మాత్రమే మిగిలిఉంది. ఈ నెల 13వ తేదీన(సోమవారం) పోలింగ్ జరుగనుండడంతో శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. పోలింగ్‌కు 48 గంటల ముందే మైకులు మూగబోవడంతో ఒక్కసారిగా వాతావరణం ప్రశాంతంగా మారింది. కాగా, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి.. ఇప్పటివరకు అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు, ర్యాలీలు, పాదయాత్రలతో.. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగాలని ప్రభుత్వం మందు షాపులను కూడా బంద్ చేయాలని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా పెట్టు 48 గంటల పాటు వైన్సులు బంద్ కానున్నాయి. ఇక ఓటర్లు ఎవరికి పట్టం కడుతారో తెలియడానికి జూన్ 4వ తేదీవరకూ వేచి చూడాల్సిందే
Read More..