మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

by Vinod kumar |
మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్ర లోని కాందార్ లోహలో ఈ నెల 26న జరగనున్న సభను బీఆర్ ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. సభ జనసమీకరణకు కోసం 20 ప్రచార రథాలు, 10 ఎల్ ఈడీ వీడియో స్ర్కీన్ వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ వాహనాలను సోమవారం పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రచార రధాల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు, ఏడాదికి ఎకరానికి రూ. 10వేల పెట్టుబడి సాయం , రైతు బీమా, 24గంటల ఉచిత కరెంట్, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడం వంటి రైతు సంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, ప్రవీణ్ పవాడీ, అంకిత్ యాదవ్ , బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story