TGSRTC: ప్రయాణికులకు శుభవార్త.. దసరా పండుగకు 6000 స్పెషల్ బస్సులు.. వివరాలివే?

by Ramesh Goud |
TGSRTC: ప్రయాణికులకు శుభవార్త.. దసరా పండుగకు 6000 స్పెషల్ బస్సులు.. వివరాలివే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ కోసం ఏకంగా 6 వేల స్పెషల్ బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకునే పండుగలలో దసరా ఒకటి. ఈ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ సారి గతంలో కంటే ఎక్కువగా 6 వేల ప్రత్యేక బస్సులను తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నడపనుంది. వీటి వివరాలను తెలుపుతూ.. టీజీఎస్ఆర్టీసీ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ పెట్టింది. ఇందులో ట్రాఫిక్ రద్దీలో సమయం తగ్గించడానికి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయని చెప్పింది.

ఇవి ఎంజీబీఎస్ నుంచి కరీంగనర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట వంటి ప్రాంతాలకు నడుస్తున్నాయని, అలాగే జేబీఎస్ నుండి వరంగల్, జంగారెడ్డిగూడెం, భూపాలపల్లి, యాదగిరిగుట్ట వంటి ప్రాంతాలకు బస్సులు ఉన్నాయని తెలిపింది. అంతేగాక ఉప్పల్ ఎక్స్ రోడ్స్ నుండి కూడా బస్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. మహబూబ్‌నగర్, కర్నూలు వెళ్లాలంటే ఆరంగర్ నుంచి, నల్గొండ, విజయవాడ, ఖమ్మం వెళ్లాలంటే ఎల్బీనగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయని, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, బీహెచ్ఈఎల్, మియాపూర్, శాంతినగర్ వంటి ప్రాంతాల నుండి కూడా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఇక ఐటీ ఉద్యోగుల సౌకర్యం కోసం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ అలాగే బెంగుళూరుకి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించింది. అలాగే కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు నడుస్తున్నాయని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఇక ముందస్తు రిజర్వేషన్ కోసం tgsrtcbus.in ను సందర్శించాలని కోరింది.

Advertisement

Next Story

Most Viewed