డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ‘కీ’ రిలీజ్

by srinivas |
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ‘కీ’ రిలీజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పరీక్ష ఫైనల్ ‘కీ’ని టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. ఫైనల్ ‘కీ’తో పాటు జనరల్ ర్యాంకింగ్ లిస్టును సైతం ప్రకటించింది. ఈ వివరాలను వెబ్‌సైట్‌లో టీజీపీఎస్సీ అందుబాటులోకి తెచ్చింది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ ఏడాది జూన్ 30 నుంచి జూలై 4 వరకు పరీక్షలు నిర్వహించింది. కాగా అభ్యర్థులు http://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో ఫైనల్ ‘కీ’ని చూసుకోవాలని సూచించింది.

Next Story

Most Viewed