- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Govt.: విద్యార్థులకు తీపి కబురు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో గుడ్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల (Young India Residential Schools) ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన బంజరాహిల్స్ (Banjara Hills)లోని కంట్రోల్ కమాండ్ సెంటర్ (Control Command Center)లో విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ (Young India Residential Schools) స్థలాల సేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
దాదాపు 105 నియోజకవర్గాల్లో అనుకున్న సమయంలోగా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేలా పనిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపు పూర్తి అయితే, ఇతర పర్మీషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. స్కూళ్లకు కేటాయించిన స్థలాలు నిర్మాణాలకు అనువైనవా లేదో నిపుణుల ద్వారా సర్వే చేయించాలని తెలిపారు. ఒకవేళ నిర్మాణాలకు అనువు కాని పక్షంలో మరోచోట స్కూళ్ల నిర్మాణానికి స్థలాన్ని సమీకరించాలని అన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు (District Collectors) క్షేత్ర స్థాయిలో విజిట్ చేసి యుద్ధ ప్రాతిపదికన స్థలాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించి కంప్లీట్ రిపోర్టును వారం రోజుల్లోగా విద్యాశాఖకు అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.