- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TG Govt.: స్వయం సహాయక సంఘాలకు గుడ్ న్యూస్.. రూ.15,453 కోట్లు విడుదల

దిశ, తెలంగాణ బ్యూరో: స్వయం సహాయక సంఘాల్లో గ్రామీణ మహిళలు చేరి ఆర్థిక అభ్యున్నతికి బాటలు వేసుకుంటున్నారు. రుణాలు తీసుకుని పొదుపు చేస్తూనే ప్రగతి వైపు అడుగులు వేస్తున్నారు. పేదరికంతో బాధపడుతున్న కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మహిళలతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయించి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది. సభ్యులతో పొదుపు చేయిస్తూనే, బ్యాంకు రుణాలు ఇప్పించి వ్యాపారాల నిర్వహణతో ఆర్థికంగా ఎదిగేలా దోహదపడుతుంది. ఈ క్రమంలో ఇందిరా మహిళా శక్తి పథకంతో మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందులో భాగంగా క్యాంటిన్లు, యునిఫాం తయారీ వంటి కార్యక్రమాలను రూపొందించింది. సంవత్సర కాలంలో బ్యాంకు లింకేజీల ద్వారా 46,28,158 లక్షల మందికి లబ్ది చేకూరినట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం విడుదల చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్-2024 లో వివరాలు వెల్లడించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) 2023-24 సంవత్సరానికి గాను 15,453.2 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు నివేదికలో పేర్కొంది.
చిన్న వ్యాపారాలే లక్ష్యంగా రుణాలు
స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. స్వయం సహయక సంఘాల సభ్యులకు బ్యాంక్ లింకేజీ రుణాలు అందించడంలో ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. సంఘాల సభ్యులుగా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సెర్ప్ ఆధ్వర్యంలో రూ.50 వేల నుంచి రూ.50 లక్షల వరకు బ్యాంక్ లింకేజీ రుణాలు అందజేస్తారు. తీసుకున్న రుణంతో చిన్నపాటి వ్యాపారం చేస్తూ దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని పొదుపు చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 1,144.6 కోట్లు అందించి నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, కుమరం భీం అసిఫాబాద్ జిల్లా 160.7 కోట్లతో చివరి స్థానంలో నిలిచింది.
తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్- 2023-24 ప్రకారం వివరాలు
జిల్లా - రుణం తీసుకున్న సంఘాలు - సంఘాల సభ్యులు -రుణ సహాయం(రూ.కోట్లలో)
నిజామాబాద్ - 19.340 - 2,52,505 - 1,144.6
నల్గొండ - 14.828 - 2,96,754 - 878.6
రంగారెడ్డి - 13.047 - 2,06,296 - 841.3
ఖమ్మం - 14.105 - 2, 62,621 - 811.7
కరీంనగర్ - 13,713 - 1,48,626 - 747.5
సిద్దిపేట్ - 13.461 - 1,93,513 - 722.1
సంగారెడ్డి - 11,752 - 1,90,338 - 709.4