TG Govt.: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నేటితో ముగియనున్న కులగణన రీ సర్వే

by Shiva |
TG Govt.: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నేటితో ముగియనున్న కులగణన రీ సర్వే
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే (Comprehensive Survey)లో పాల్గొనని కుటుంబాల వివరాలను సేకరించేందుకు చేపట్టిన కులగణన రీ సర్వే నేటితో ముగియనుంది. అయితే, నవంబరు 6 నుంచి డిసెంబరు 25 వరకు నిర్వహించిన సమగ్ర సర్వేలో తప్పులు దొర్లాయని ప్రజలు, రాజకీయ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తెలంగాణ సర్కార్ (Telangana Government) ఈనెల ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రీ సర్వేకు అవకాశం కల్పించింది. కాగా, సర్వేకు సంబంధించి గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటికే సర్వే బృందలు ఇంటింటికీ వెళ్లి మొదటి దఫా సర్వేలో పాల్గొనని కుటుంబ వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వం మరోసారి సర్వేకు అవకాశం కల్పించినా కేవలం 10 వేల కుటుంబాలే సర్వేలో ఎంట్రీ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్‌ (Toll Free Number) 040 - 21111111ను అందుబాటులోకి తీసుకొచ్చే సర్వే బృందాలకు నేరుగా కాల్ చేసిన ప్రజలకు తమ వివరాలు ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

కాగా, రాష్ట్రంలో చేపట్టిన తొలి విడత సర్వేలో మొత్తం 1,15,71,457 కుటుంబాలు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. మొత్తం 50 రోజుల పాటు నిర్విరామంగా 1,12,15,134 కుటుంబాల వివరాలను సేకరించారు. మొత్తం 3,54,77,554 మందిని ఆయా వర్గాలకు చెందిన వారిగా కులగణన (Cast Census) సర్వేలో అధికారులు గుర్తించారు. సర్వేలో కొంతమంది తమ కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడించకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో సర్వేకు సహకరించకపోవడంతో దాదాపు 3.5 లక్షల కుటుంబాల నుంచి సమాచారం సేకరించలేకపోయారు. ఈ నేపథ్యంలో సర్వేలో తప్పులు దొర్లాయని, పూర్తి సమాచారం సేకరించ లేదని, ఖచ్చితత్వం లేదంటూ ప్రజలతో పాటు విపక్షాలు అభ్యతరం వ్యక్తం చేశాయి. దీంతో సర్వేలో పాల్గొనని కుటుంబాల కోసం ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 28 వరకు 13 రోజుల పాటు రీ సర్వే చేపట్టాలని అధికారులను తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

Next Story

Most Viewed