TG Assembly: కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడు.. ప్రతిపక్ష హోదా ఎందుకు: అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి ఫైర్

by Shiva |
TG Assembly: కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడు.. ప్రతిపక్ష హోదా ఎందుకు: అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడు బీఆర్ఎస్‌‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఫైర్ అయ్యారు. సోమవారం అసెంబ్లీలో వివిధ శాఖల పద్దులపై చేపట్టిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అరకొర ఉచిత కరెంట్ ఇచ్చి బీఆర్ఎస్ గతంలో గొప్పలు చెప్పిందని ఆరోపించారు. విద్యుత్ శాఖపై గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని అన్నారు. ఒకవేళ అన్ని సక్రమంగా చేస్తే.. విద్యుత్ సంస్థలు నష్టాల్లోకి ఎందుకు వెళ్లాయని ధ్వజమెత్తారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు హాజరుకావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఒకవేళ ఆయన సభకు రాకపోతే బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలని మండి పడ్డారు. రైతులకు ఆనాడు.. ఈనాడు ఉచితంగా కరెంట్ ఇచ్చింది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు నేడు ప్రెస్‌మీట్లు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంలను లాభాల్లో బాటలో తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా.. మళ్లీ మాపైనే నిందలు వేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు. బీఆర్ఎస్ చేసిన తప్పలు ఒప్పుకోవాలని.. ఒక వేళ ప్రభుత్వానికి కరెంట్ కొనుగోళ్ల విషయంలో సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటామని అన్నారు.

Advertisement

Next Story