- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TG Assembly: పల్లా రాజేశ్వర్ రెడ్డి వాస్తవాలు మాట్లాడు.. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలకు తిరస్కరించిన వారికి ఇంకా కనువిప్పు కలుగలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ అసెంబ్లీ గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగానికి దశ, దిశ లేదని కామెంట్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని అన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలల గడుస్తున్నా.. రుణామాఫీ పూర్తిగా జరగలేదని, ఇచ్చిన హామీల్లో కేవలం 10 శాతం మాత్రమే అమలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని.. జర్నలిస్టులపై కేసులు పెట్టిందని సభ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోందని.. పేర్లు మార్చడం కాదు.. ప్రజల జీవితాను మార్చాలని ఎమ్మెల్యే పల్లా అన్నారు.
ఈ క్రమంలోనే ఆయన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నాడు టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి, అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 లక్షల రుణమాఫీ చేశామని అన్నారు. జనగామ నియోజకవర్గంలో రూ.263 కోట్లు, గజ్వేల్ నియోజకవర్గంలో రూ.237 కోట్లు, సిద్దిపేట నియోజకవర్గంలో రూ.177.91 కోట్లు, సిరిసిల్లలో రూ.175 కోట్లు, నిర్మల్ నియోజకవర్గంలో 202 కోట్ల రుణమాఫీ జరిగిందని తెలిపారు. విద్యా శాఖలో 11 వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. సుమారు 36 వేల మంది టీచర్లను బదిలీ చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు 12 మంది వీసీలను నియమించామని అన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి తొలిసారి దళిత వీసీని నియమించామని తెలిపారు. ఇప్పటికైనా పల్లా రాజేశ్వర్ రెడ్డి వాస్తవాలు మాట్లాడాలని.. సభను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయొద్దని డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇచ్చారు.
Read More..
TG Assembly: ఇచ్చిన మాట ప్రకారం ఆ పని చేశాం.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు