నగరానికి శ్రావణ శోభ.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

by sudharani |   ( Updated:2023-08-25 05:54:04.0  )
నగరానికి శ్రావణ శోభ.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
X

దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్ మహానగరం శుక్రవారం శ్రావణ శోభన సంతరించుకుంది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం శుభ సందర్భాలను పురస్కరించుకొని నగరంలోని అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆధ్యాత్మికత దైవచింతన వెల్లువిరిసింది. ముఖ్యంగా అమ్మవారి దేవాలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి కనిపించింది. ముఖ్యంగా చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి 10 గంటల వరకు వేలాది సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు సమాచారం.

ఫ్రైడే టెన్షన్

శ్రావణ శుక్రవారం పైగా వరలక్ష్మీ వ్రతం కావడంతోపాటు శుక్రవారం చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులో ముస్లింలు ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించనుండడంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద వేల సంఖ్యలో భక్తులు క్యూ కట్టగా, సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వేలాదిమంది ముస్లింలు మక్కా మసీదులో సామూహిక ప్రార్ధన నిర్వహించేందుకు వస్తున్నాడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed