- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉగ్రవాదులను పసిగట్టడంలో తెలంగాణ పోలీస్ కమాండ్ సెంటర్ ఫెయిల్: VHP
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొత్తగా కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రాజకీయ నాయకుల కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతుందని, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి హిందూ నాయకుల కదలికలు పసిగడుతుందని, కానీ ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టడంలో మాత్రం విఫలమైందని విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా హిందూ నాయకులపై అక్రమ కేసులు బనాయించేందుకు ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను వినియోగించుకుంటుందని వీహెచ్ పీ మండిపడింది.
భాగ్యనగర్‌లోని ఉగ్రవాదుల కదలికలు, బంగ్లాదేశీయులు, విదేశాల నుంచి వచ్చిన ఉగ్రవాదుల స్థావరాలు, మత మార్పిడి ముఠాలు కంట్రోల్ రూమ్‌కు ఏ మాత్రం పట్టడం లేదని విమర్శలు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసులు పట్టుకుంటే కానీ విశ్వనగరంలోని ఉగ్రవాదుల జాడ ఇక్కడి వారికి తెలియకపోవడం ఓవైసీ(కారు స్టీరింగ్) మహిమ అని వీహెచ్ పీ నేతలు ఎద్దేవా చేశారు.
బంజారాహిల్స్ లాంటి ప్రముఖమైన ప్రాంతంలో ముఖ్యంగా ఓవైసీ అనుచరులు పోలీసులపై దాడి చేసినా కేసులు ఉండవని, ఉన్నా నామ మాత్రమేనని వారు పేర్కొన్నారు. జగిత్యాల వంటి ప్రాంతాల్లో అకారణంగా పోలీస్ సబ్‌ఇన్ స్పెక్టర్లపైనే కేసు నమోదు చేసి సస్పెండ్ చేసినా చేస్తారని ఎద్దేవా చేశారు. ఇదంతా ఓవైసీ మహిమ అని, తప్పు ముస్లింలు చేసినా కేసులు హిందువులపైనే అని, దట్‌ఈస్ పవర్ ఆఫ్ తెలంగాణ పోలీస్ కమాండ్ సెంటర్ అని వీహెచ్ పీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.