వైద్యశాఖలో డాక్టర్ల నియామకానికి నోటిఫికేషన్

by M.Rajitha |
వైద్యశాఖలో డాక్టర్ల నియామకానికి నోటిఫికేషన్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ వైద్యశాఖలో డాక్టర్ల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ లో మొత్తం 235 పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేపట్టనున్నారు. వీటిలో ఉస్మానియా హాస్పిటల్ కు సంబంధించి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు మొత్తంగా175 పోస్టులు ఉండగా.. గాంధీ హాస్పిటల్ లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు మొత్తంగా 60 పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాలను ఆగస్ట్ 9, 2024 రోజు ఉదయం 10.30 గంటలకు గాంధీ మెడికల్ కాలేజ్ పరిపాలన భవనంలో వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా పూర్తి చేయనున్నారు. ఈ నియామకాల ప్రక్రియను పారదర్శకంగా జరపాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమీషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed