గవర్నర్‌పై సర్కార్ లంచ్ మోషన్ పిటిషన్.. హైకోర్ట్ సీజే కీలక వ్యాఖ్యలు

by Nagaya |   ( Updated:2023-01-30 06:33:07.0  )
గవర్నర్‌పై సర్కార్ లంచ్ మోషన్ పిటిషన్.. హైకోర్ట్ సీజే కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అనుమతి ఇవ్వకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగింది. బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చేలా గవర్నర్ ను ఆదేశించాని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసింది. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అత్యవసర విచారణ జరపాలని కోరింది. ఈ అంశంలో గవర్నర్ తీరును హైకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. దీనిపై ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ జరిపేందుకు సీజే ధర్మాసనం అంగీకారం తెలిపింది. పిటిషన్ ను అనుమతించే సందర్భంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో న్యాయ వ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. గవర్నర్ కు కోర్టు నోటీసు ఇవ్వగలదా? గవర్నర్ విధుల్లో కోర్టులు న్యాయ సమీక్ష చేయవచ్చా? అని ఏజీని కోర్టు ప్రశ్నించింది. దీనికి పూర్తిగా వివరిస్తామని అడ్వకేట్ జనరల్ చెప్పారు. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తారని ఏజీ వివరించారు.

Advertisement

Next Story