- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వాటిని పొడిగిస్తూ నిర్ణయం

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS) పాలకవర్గాల గుడువును పొడిగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 904 సహకార సంఘాల కాల పరిమితి, 9 డీసీసీబీ(DCCB) ఛైర్మన్ల పదవీకాలాన్ని మరో ఆరునెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆయా పాలకవర్గాల పదవీకాలాలకు ఆరు నెలల ముందే ఎన్నికల ప్రక్రియ మొదలవాల్సి ఉండగా.. ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ప్రస్తుతం ఉన్న పాలక వర్గాల గడువు రేపటితో ముగియనుండగా.. ప్రభుత్వం వాటిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే స్థానిక ఎన్నికల తరువాతే వీటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు దీనిని బట్టి తెలుస్తోంది. కాగా పదవీకాలం పొడిగిస్తూ జీవో జారీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావుకు పాలక వర్గాలు, డీసీసీబీ చైర్మన్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.