- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.. వచ్చేవారం ఖాతాలోకి నగదు జమ..
దిశ వెబ్ డెస్క్: ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా రైతులు పండించిన పంట నీట మునిగిన విషయం తెలిసిందే. దీనితో రైతులు భారీగా నష్టపోయారు. కాకా ఈ ఘటనపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేదుకు ముందడుగు వేసింది.
కాగా పంట నష్టానికి గురైన రైతుకు నష్టపరిహారం కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించింది. కాగా తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా 10 జిల్లాల్లో 15,8121 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్టు మార్చిలో వ్యవసాయశాఖ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని అధికార పార్టీ మంత్రులు తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంచేత నగదు పంపిణీ చేయలేకపోతున్నామని, ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాగానే పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో రైతులకు నష్టపరిహారం అందించేందుకు అనుమతి కోరుతూ ఈసీకి ప్రభుత్వం లేఖ కూడా రాసింది.
కాగా ఆ లేఖపై స్పందించిన ఈసీ నష్టపరిహారం పంపిణీకి అనుమతినిచ్చిందని సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే వారం నుండి రైతుల ఖాతాలోకి ప్రభుత్వం నగదు జమ చేయనున్నట్టు తెలిపింది.
Read More..
బకాయి ఉంటే ముక్కు నేలకు రాస్తా.. KCRకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్