- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana Congress: కేటీఆర్.. ఉచిత బస్సు ప్రయాణం విలువ వాళ్లని అడుగు?.. టి కాంగ్రెస్ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ మంత్రులు, నాయకులే కాక యావత్ మహిళా లోకం బగ్గుమంటుంది. తెలంగాణ మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. అధికారం పోయిందన్న అక్కసుతోనే మహిళలపై కేటీఆర్ ఈ అహంకారపు మాటలు అని ఫైర్ అయ్యింది. ఈ సందర్భంగా ఉచిత బస్సు సౌకర్యం విలువ ఏంటో కాలేజీకి వెళుతున్న విద్యార్ధిని, కోచింగ్ కు వెళుతున్న నిరుద్యోగ యువతిని, ఆఫీస్ కు వెళ్తున్న సాధారణ మహిళా ఉద్యోగిని, హాస్పిటల్ కు వెళుతున్న అమ్మని, గుడికి వెళ్లే అవ్వను అడగాలని పోస్ట్ పెట్టారు. దీనిపై మిస్టర్ కేటీఆర్.. విలాసవంతమైన జీవితం బ్రతికే నీకు.. ఉచిత బస్సు ప్రయాణం విలువ తెలియాలంటే, పేదింటి ఆడబిడ్డలను అడుగు వివరించి చెబుతారు అని రాసుకొచ్చారు. కాగా గురువారం కేటీఆర్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. బస్సులో వెళ్లుల్లి తీసుకున్నా, అల్లికలు చేసిన వద్దనడం లేదని.. కావాలంటే రికార్డింగ్ డ్యాన్సులు కూడా వేసుకోమనండి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. దీనిపై కేటీఆర్ మహిళా కమీషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 24న విచారణకు రావాలని ఆదేశించింది.