Telangana cabinet: మార్చి 6న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

by Prasad Jukanti |
Telangana cabinet:  మార్చి 6న తెలంగాణ మంత్రివర్గ సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మార్చి 6న తెలంగాణ మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet Meeting) నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన సమావేశం కాబోతున్న కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నది. రాష్ట్రంలో రెండో దఫా కులగణన (Cast Census) నిర్వహించిన నేపథ్యంలో వాటికి సంబంధించిన గణాంకాలపై కేబినెట్ చర్చించనున్నది. అలాగే బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు (SC Classification) చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు మార్చి లో ప్రత్యేకంగా అసెంబ్లీని (TG Assembly) సమావేశపరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఈ నేఫథ్యంలో ఈ అంశాలపై కూడా మంత్రిమండలి చర్చించే అవకాశం ఉన్నది. అలాగే రాష్ట్రంలో ఏన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) పంపిణీ చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ కారణంగా పలు జిల్లాల్లో ఈ విషయంలో తర్జనభర్జన జరుగుతున్నది. మార్చి 3తో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియనున్నది. దీంతో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కేబినెట్ లో చర్చించే ఆస్కారం ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై కేబినెట్ డెసిషన్స్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Next Story