- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అప్పుడు గుజరాత్‌లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.. CM రేవంత్‌కు టీ.బీజేపీ కౌంటర్

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) కులంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ బీజేపీ(Telangana BJP) నేతలంతా వరుసగా సీఎం రేవంత్‌పై మండిపడుతున్నారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) మాట్లాడుతూ.. మోడీపై తప్పుడు వ్యాఖ్యలుచేస్తే చరిత్రహీనుడివవుతావని అన్నారు. రేవంత్ రెడ్డి ఖబడ్దార్ అని హెచ్చరించారు. పదవి కాపాడు కోవడానికే మోడీపై రేవంత్ రెడ్డి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌కు తగిన బుద్ధి చెబుతామని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఎంపీ లక్ష్మణ్(MP Laxman) మాట్లాడుతూ.. సీఎం రేవంత్ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. మోడీ కులాన్ని 1994లోనే బీసీల్లో కలిపారు.. అప్పుడు గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt)మే ఉందని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం చేసిన వ్యక్తి మోడీ అన్నారు.
కాగా, గాంధీ భవన్(Gandhi Bhavan)లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ బీసీ కాదు.. కన్వర్టెడ్ బీసీ అన్నారు. 2002 వరకు ఉన్నత వర్గాల్లో మోడీ ఉండేవాళ్లు.. మోడీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో కలిపారని తెలిపారు. మోడీ కులం గురించి ఆషామాషీగా చెప్పడం లేదు.. అన్నీ తెలుసుకునే మోడీ కులంపై మాట్లాడుతున్నా.. ఇక మీరే ఆలోచించుకోండని సీఎం రేవంత్ అన్నారు.