- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్కసారిగా వారణాసికి క్యూ కట్టిన తెలంగాణ బీజేపీ లీడర్స్.. ఎందుకంటే..?
దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. జూన్ 1వ తేదీతో ఏడో విడత పోలింగ్ జరగనుంది. కాగా ఈనెల 30న సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుంది. ఈ తుది విడుతలోనే ప్రధాని మోడీ పోటీ చేయనున్న వారణాసి లోక్ సభ స్థానానకి పోలింగ్ జరగనుంది. మోడీ పోటీ చేస్తున్న లోక్ సభ స్థానం కావడంతో ఈ ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే మోడీకి మద్దతుగా బీజేపీ తెలంగాణ స్టేట్ లీడర్ షిప్ మొత్తం వారణాసికి తరలనుంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వెళ్లి ప్రచారం చేపట్టి వచ్చారు. అలాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సైతం వారణాసిలో ఉన్న తెలుగు ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
మోడీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. కాగా రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో బిజీగా ఉన్న స్టేట్ లీడర్ షిప్ ఇక్కడ ప్రచారానికి తెరపడటంతో వారణాసికి వెళ్లాలని చూస్తున్నారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం వెళ్లి ఈనెల 30వ తేదీ వరకు అక్కడే ఉండి ప్రచారం చేపట్టనున్నారు. పలువురు రాష్ట్ర ముఖ్య నేతలు సైతం ప్రచారానికి వెళ్లనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 400 ప్లస్ సీట్లను టార్గెట్‌గా పెట్టుకోవడంతో చివరి విడుతలో అత్యధిక స్థానాలు గెలిచి తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని పార్టీ భావిస్తోంది.